మానవాభివృద్ధి సూచీలో భారత్‌కు 129వ స్థానం
Sakshi Education
ప్రపంచ మానవాభివృద్ధి సూచీలో భారత్‌కు 129వ స్థానం లభించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) 2019 ఏడాదికి గాను రూపొందించిన ప్రపంచ మానవాభివృద్ధి సూచీ నివేదికను డిసెంబర్ 9న విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం ప్రపంచ మానవాభివృద్ధి సూచీలో తొలి మూడు స్థానాల్లో నార్వే, స్విట్జర్లాండ్, ఐర్లాండ్ నిలిచారుు. పాకిస్తాన్ 152వ స్థానంలో ఉంది. అట్టడుగున 189 స్థానంలో నైగర్ ఉంది. 189 దేశాలతో ఈ జాబితాను రూపొందించారు.
2005-06 నుంచి 2015-16 వరకు 27.1 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడినట్టు యూఎన్‌డీపీ ఇండియా ప్రతినిధి షోకో నోడా వెల్లడించారు. ప్రపంచ మానవాభివృద్ధి సూచీ-2018లో భారత్ 130వ స్థానంలో ఉంది. మూడు దశాబ్దాలుగా జరుగుతున్న అభివృద్ధి కారణంగా పేదరికంలోనూ, భారతీయుల ఆయుర్దాయంలోనూ, విద్య, వైద్య సదుపాయాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని యూఎన్‌డీపీ నివేదిక వెల్లడించింది.
మానవాభివృద్ధి సూచీ నివేదిక - ముఖ్యాంశాలు
- 1.3 బిలియన్ల మంది నిరుపేదల్లో 28 శాతం మంది భారత్‌లో ఉన్నారు. అరుుతే ఇక్కడ ఇంకా స్త్రీలు, బాలికలు అసమానతల సవాళ్ళను ఎదుర్కొంటూనే ఉన్నారు.
- భర్తల చేతిలో హింసకు గురౌతున్న మహిళలు సింగపూర్‌లో అతి తక్కువ.
- దక్షిణాసియాలో 31 శాతం మంది మహిళలు భర్తల చేతిలో హింసకు గురౌతున్నారు.
-లింగ అభివృద్ధి సూచీలో దక్షిణాసియా దేశాల సగటు కంటే భారత్ కొద్దిగా మెరుగైన స్థితిలో ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ మానవాభివృద్ధి సూచీలో భారత్‌కు 129వ స్థానం
ఎప్పుడు : డిసెంబర్ 9
ఎవరు : ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ)

Published date : 10 Dec 2019 06:11PM