Skip to main content

మానవ హక్కుల దినోత్సవం

ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 10న ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమీషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు.
Current Affairsఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ... దేశవ్యాప్తంగా మహిళలపై పెరిగిపోతున్న నేర ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో సమానహక్కులు అన్న సార్వత్రిక లక్ష్యం సఫలతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ‘ప్రపంచమంతా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. దీనిపై ప్రతి ఒక్కరూ ఆత్మశోధన చేసుకోవాలి’అని ఆయన అన్నారు. యూడీహెచ్‌ఆర్‌ను సమీక్షించి మానవ హక్కులను పునః నిర్వచించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, భారత్‌లో ఐక్యరాజ్య సమితి రెసిడెంట్ కో ఆర్డినేటర్ రెనెటా లోక్ డెస్సాలియన్ హాజరయ్యారు.
 
ప్రారంభం
ఐక్యరాజ్యసమితి 1948లో యూనివర్సల్‌ డిక్లరేషన్ ఆఫ్‌ హ్యూమన్ రైట్స్‌ (యూడీహెచ్‌ఆర్‌)ను ఆమోదించగా.. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా డిసెంబర్‌ 10వ తేదీని మానవ హక్కుల దినంగా పాటిస్తున్నారు. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడంకోసం కోర్టులతోపాటు మానవ హక్కుల కమిషన్ లు ఏర్పాటుచేయబడ్డాయి.
కార్యక్రమాలు
  • 2008 డిసెంబరు 10న యూనివర్సల్‌ డిక్లరేషన్ ఆఫ్‌ హ్యూమన్ రైట్స్‌ 60వ వార్షికోత్సవం జరిగింది. యునైటెడ్‌ నేష‌న్స్ సెక్రటరీ జనరల్‌ ఆ ఏడాది అంతా మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన ప్రణాళికలు, ఉపన్యాసాలతో సభలు, సమావేశాలు ఏర్పాటు చేశారు. యు.డి.హెచ్‌.ఆర్‌ రూపొందించిన డాక్యుమెంట్‌ 360 భాషల్లోకి అనువాదమై ప్రపంచ రికార్డు సాధించింది.
  • 1998లో మాల్దావా ఫిఫ్టీ ఇయర్స్‌ ఆఫ్‌ ది యూనివర్సల్‌ డిక్లరేషన్ ఆఫ్‌ హ్యూమన్ రైట్స్‌ అంటూ ఒక పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. తైవాన్ లో షియా మింగ్‌–టెహ్‌ 1979లో హ్యూమన్ రైట్స్‌ ప్రదర్శనలు నిర్వహించింది.

 క్విక్ రివ్యూ   :
 ఏమిటి :
ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం
 ఎప్పుడు : డిసెంబర్ 10
 ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
 ఎక్కడ : న్యూఢిల్లీ

Published date : 11 Dec 2019 05:40PM

Photo Stories