Skip to main content

మానవ అక్రమరవాణా కట్టడికి రూపొందించిన వెబ్‌సైట్‌?

మానవ అక్రమ రవాణాను (ట్రాఫికింగ్‌) నిరోధించేందుకు తెలంగాణ పోలీసులు వినూత్న ప్రయోగం చేశారు.
పిల్లలు, మహిళలకు ప్రమాదకరంగా మారిన మానవ అక్రమ రవాణా నిరోధకానికి దేశంలోనే తొలి వెబ్‌సైట్‌ ధ్రువహెచ్‌టీ (http://dhruvaht.org/ (డీహెచ్‌ఆర్‌యూవీఏహెచ్‌టీ.ఓఆర్‌జీ))ను ఇటీవల ప్రారంభించారు. విమెన్‌సేఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో బ్రిటిష్‌ హైకమిషన్, తరుణి స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో మనుషుల అక్రమ రవాణా కేసులు తరచుగా వెలుగుచూస్తున్నాయి. మహిళలు, బాలికలను ఎత్తుకెళ్లి వ్యభిచార గృహాలకు విక్రయించడం, పిల్లల చేత బలవంతంగా పనిచేయించడం, భిక్షాటన, వారి అవయవాల మార్కెటింగ్‌ తదితర మాఫియా ముఠాల ఆట కట్టించడం ధ్రువహెచ్‌టీ వెబ్‌సైట్‌ ముఖ్య ఉద్దేశం. అలాగే దీనిపై ఆన్‌లైన్‌లో పోలీసులకు, సాధారణ పౌరులకు సైతం శిక్షణ ఇస్తారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ధ్రువహెచ్‌టీ (http://dhruvaht.org/ (డీహెచ్‌ఆర్‌యూవీఏహెచ్‌టీ.ఓఆర్‌జీ)) వెబ్‌సైట్‌ ప్రారంభం
ఎప్పుడు : జూలై నెల, 2021
ఎవరు : తెలంగాణ పోలీస్‌ శాఖ
ఎందుకు : మానవ అక్రమ రవాణాను (ట్రాఫికింగ్‌) నిరోధించేందుకు...
Published date : 02 Aug 2021 06:01PM

Photo Stories