Skip to main content

మాలి ప్రధాని మైగా రాజీనామా

మాలి దేశ ప్రధానమంత్రి సౌమేలౌ బౌబేయే మైగా కేబినెట్ సహచరులందరితో కలిసి రాజీనామా చేశారు.
వారందరి రాజీనామాలనూ ఆమోదించినట్టు దేశాధ్యక్షుడు ఇబ్రహీం బౌబకర్ కీటా కార్యాలయం ఏప్రిల్ 19న ప్రకటించింది. అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి త్వరలోనే నూతన ప్రధాని పేరును ప్రకటిస్తామని తెలిపింది.

మాలి దేశంలో భూముల వివాదంలో డోగోన్, ఫులానీ తెగల మధ్య ఏళ్ల తరబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. 2019, మార్చి 23న ఒగాస్సగో గ్రామంలో ఫులానీ తెగకు చెందిన 160 మంది ఊచకోతకు గురయ్యారు. ఆ తెగకు చెందిన ప్రజలతోపాటు ప్రతిపక్ష పార్టీలు, పౌరహక్కుల సంఘాల నేతలు అప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దేశంలో ఉద్రిక్తతలను తగ్గించడంలో విఫలమయ్యారంటూ అధికార, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఏప్రిల్ 17న ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
మాలి దేశ ప్రధానమంత్రి రాజీనామా
ఎప్పుడు : ఏప్రిల్ 19
ఎవరు : సౌమేలౌ బౌబేయే మైగా
ఎందుకు : దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో
Published date : 20 Apr 2019 05:33PM

Photo Stories