మాజీ కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ కన్నుమూత
Sakshi Education
కేంద్ర మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు బేణీ ప్రసాద్ వర్మ కన్నుమూశారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మార్చి 27న లక్నోలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఉత్తరప్రదేశ్ బారాబంకీలో 1941, ఫిబ్రవరి 11న జన్మించిన ప్రసాద్ 1996-98 కాలంలో అప్పటి ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మంత్రివర్గంలో టెలికాం మంత్రిగా పనిచేశారు. అలాగే 2011, జనవరి 11 నుంచి 2014, మే 26 వరకు ఉక్కు శాఖ మంత్రిగా పనిచేశారు.
Published date : 28 Mar 2020 06:48PM