Skip to main content

మాడ్రిడ్ క్లబ్ మాజీ అధ్యక్షుడు లొరెంజో మృతి

ప్రపంచ ఫుట్‌బాల్‌లో విఖ్యాత క్లబ్‌గా పేరొందిన రియల్ మాడ్రిడ్ క్లబ్ మాజీ అధ్యక్షుడు లొరెంజో సాంజ్ మృతి చెందారు.
Current Affairsకొన్నిరోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడిన ఆయన ఆస్పత్రిలో చిక్సిత తీసుకుంటూ మార్చి 22న కన్నుమూశారు. 76 ఏళ్ల లొరెంజో 1995 నుంచి 2000 వరకు రియల్ మాడ్రిడ్ క్లబ్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన హయాంలో రియల్ మాడ్రిడ్ జట్టు 1998, 2000లో ప్రతిష్టాత్మక చాంపియన్‌‌స లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

118 ఏళ్ల చరిత్ర ఉన్న రియల్ మాడ్రిడ్ క్లబ్ స్పెరుున్ దేశవాళీ ఫుట్‌బాల్ టోర్నీ లా లీగాలో 33 సార్లు... యూరోప్ దేశాల్లోని క్లబ్ జట్ల మధ్య జరిగే చాంపియన్‌‌స లీగ్ టోర్నీలో 13 సార్లు విజేతగా నిలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రియల్ మాడ్రిడ్ క్లబ్ మాజీ అధ్యక్షుడు కన్నుమూత
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : లొరెంజో సాంజ్
ఎందుకు : కోవిడ్-19 కారణంగా
Published date : 23 Mar 2020 06:29PM

Photo Stories