లోక్‌సభ ప్రోటెం స్పీకర్‌గా వీరేంద్ర కుమార్
Sakshi Education
లోక్‌సభ ప్రోటెం స్పీకర్‌గా మధ్యప్రదేశ్‌కు చెందిన భాజపా ఎంపీ వీరేంద్ర కుమార్ నియమిస్తూ జూన్ 11న కేంద్రప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
7 సార్లు ఎంపీగా పనిచేసిన ఆయన ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో టికమ్‌గఢ్ నుంచి ఎన్నికయ్యారు. మోదీ ప్రభుత్వంలో ఇంతకుముందు కేంద్ర సహాయమంత్రిగా పనిచేశారు. ప్రోటెం స్పీకర్‌గా ఆయన ఆధ్వర్యంలోనే కొత్త ఎంపీల ప్రమాణస్వీకారంతో పాటు, స్పీకర్ ఎన్నిక జరగనున్నాయి. 17వ లోక్‌సభ సమావేశాలు జూన్ 17వ తేదీ నుంచి జూలై 26 వరకు జరగనున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : లోక్‌సభ ప్రోటెం స్పీకర్‌గా నియామకం
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : వీరేంద్ర కుమార్
క్విక్ రివ్యూ :
ఏమిటి : లోక్‌సభ ప్రోటెం స్పీకర్‌గా నియామకం
ఎప్పుడు : జూన్ 11
ఎవరు : వీరేంద్ర కుమార్
Published date : 12 Jun 2019 06:17PM