Skip to main content

లోక్‌పాల్ అన్వేషణ కమిటీ భేటీ

లోక్‌పాల్ చైర్మన్, సభ్యులను ఎన్నుకునే సెలక్షన్ కమిటీకి పేర్లను ప్రతిపాదించేందుకు ఏర్పాటైన ‘అన్వేషణ’ కమిటీ తొలిసారిగా భేటీ అయ్యింది.
న్యూఢిల్లీలో జనవరి 29న జరిగిన ఈ భేటీలో లోక్‌పాల్ చీఫ్, సభ్యుల అన్వేషణ, ఎంపిక విధానంపైనే చర్చ జరిగిందని కమిటీ పేర్కొంది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి రంజన్ ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో 8మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటుచేసి నాలుగు నెలలు గడిచాక తొలిసారి సమావేశమైంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
లోక్‌పాల్ అన్వేషణ కమిటీ భేటీ
ఎప్పుడు : జనవరి 29
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 30 Jan 2019 05:45PM

Photo Stories