లీడర్ టు లీడర్ డైరీని రూపొందించిన నవలా రచయిత?
ఈ డైరీని ఆగస్టు 19న హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ(యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ) గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ చేతులమీదుగా ఆవిష్కరించారు. మహానేత వైఎస్సార్ జీవితంలోని ముఖ్య ఘట్టాలతో పాటుగా, వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర, ప్రజా సంకల్ప యాత్ర, రైతు భరోసా విశేషాలను డైరీలో కళ్లకు కట్టినట్లు చూపించామని నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
నెడ్‌క్యాప్ చైర్మన్ ప్రమాణ స్వీకారం
న్యూ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(నెడ్‌క్యాప్) చైర్మన్‌గా కె.కె.రాజు ప్రమాణ స్వీకారం చేశారు. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ హాల్లో ఆగస్టు 19న ఈ కార్యక్రమం జరిగింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ నవలా రచయిత వేంపల్లి నిరంజన్‌రెడ్డి రూపొందించిన ‘లీడర్ టు లీడర్’ డైరీ ఆవిష్కరణ
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : వైఎస్సార్‌సీపీ(యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ) గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ
ఎక్కడ : హైదరాబాద్