లేవర్ కప్ విజేతగా యూరోప్ జట్టు
Sakshi Education
ప్రతి యేటా మేటి టెన్నిస్ ఆటగాళ్ల మధ్య నిర్వహిస్తున్న లేవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో యూరోప్ జట్టు వరుసగా మూడో ఏడాది విజేతగా నిలిచింది.
స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో మూడు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో యూరోప్ జట్టు 13-11తో వరల్డ్ టీమ్‌పై విజయం సాధించింది. యూరోప్ జట్టులో రాఫెల్ నాదల్ (స్పెయిన్), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), సిట్సిపాస్ (గ్రీస్), ఫాగ్‌నిని (ఇటలీ), బాటిస్టా అగుట్ (స్పెయిన్) సభ్యులుగా ఉన్నారు. అలాగే వరల్డ్ టీమ్‌లో జాన్ ఇస్నెర్ (అమెరికా), మిలోస్ రావ్‌నిచ్ (కెనడా), నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా), టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా), షపోవలోవ్ (కెనడా), జాక్ సోక్ (అమెరికా), జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా) సభ్యులుగా ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : లేవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : యూరోప్ జట్టు
ఎక్కడ : జెనీవా, స్విట్జర్లాండ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : లేవర్ కప్ టెన్నిస్ టోర్నమెంట్ విజేత
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : యూరోప్ జట్టు
ఎక్కడ : జెనీవా, స్విట్జర్లాండ్
Published date : 24 Sep 2019 05:41PM