Skip to main content

లెబనాన్ రాజధాని బీరుట్‌ లో భారీ పేలుడు

లెబనాన్ రాజధాని బీరుట్‌ నగరంలో ఆగస్టు 4న భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా 135 మృతి చెందగా, 5,000 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు.
Edu news ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. పేలుడుతో బీరుట్‌ పోర్ట్ పరిసర ప్రాంతాలు బూడిద, వ్యర్థాలతో నిండిపోయాయి. పెద్దసంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. భవనాలు నేలమట్టమయ్యాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

అమ్మోనియం నైట్రేట్‌..
2,700 టన్నులకు పైగా అమ్మోనియం నైట్రేట్‌కు మంటలు అంటుకోవడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు లెబనాన్ మంత్రి మొహమ్మద్‌ ఫహ్మీ తెలిపారు. బీరుట్‌ పోర్ట్‌లోని ఓ గోదాములో దీన్ని నిల్వ చేశారు. 2014లో ఓ సరుకు రవాణా నౌక నుంచి ఈ అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పేలుడుతో విషపూరితమైన నైట్రోజన్డయాక్సైడ్‌ గ్యాస్‌ విడుదలైంది. దీన్ని పీల్చడం వల్ల చాలామంది శ్వాస ఆడక ప్రాణాలొదిలారు.

ఆహార సంక్షోభం..
చాలా చిన్న దేశమైన లెబనాన్ లో ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుప్పకూలింది. సూమారు 10 లక్షల మందికి పైగా సిరియా శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తోంది. విదేశాల నుంచి నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాల దిగుమతికి బీరూట్‌ పోర్ట్‌ అత్యంత కీలకం. తాజా పేలుడు వల్ల ఈ ఓడరేవు చాలావరకు నామరూపాల్లేకుండా పోయింది. దిగుమతులన్నీ ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో దేశంలో ఇకపై ఆహార సంక్షోభం తప్పదని వాదన వినిపిస్తోంది.

ఆదుకోండి..
ఆర్థిక సంక్షోభంతోపాటు బీరుట్‌లో పేలుడు వల్ల తాము కష్టాల్లో కూరుకుపోయామని, ప్రపంచ దేశాలు, మిత్ర దేశాలు వెంటనే స్పందించి, ఆదుకోవాలని లెబనాన్ ప్రధానమంత్రి హసన్ దియాబ్‌ విజ్ఞప్తి చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : భారీపేలుడు కారణంగా 135 మృతి
ఎప్పుడు : ఆగస్టు 4
ఎక్కడ :బీరుట్‌, లెబనాన్
Published date : 07 Aug 2020 03:44PM

Photo Stories