లడఖ్‌లో అతిపెద్ద సౌర విద్యుత్ కర్మాగారం
Sakshi Education
జమ్మూకశ్మీర్‌లోని లడఖ్‌లో ప్రపంచంలోనే అతిపెద్దదైన సౌర విద్యుత్ కర్మాగారం ఏర్పాటుచేయనున్నట్లు భారత సౌర విద్యుత్ సంస్థ (ఎస్‌ఈసీఐ) జనవరి 13న వెల్లడించింది.
25వేల ఎకరాల్లో ఐదు వేల మెగావాట్ల సామర్థ్యంతో ఈ విద్యుత్ కర్మాగారంను నెలకొల్పనున్నారు. అలాగే జమ్మూకశ్మీర్‌లోనే ఉన్న కార్గిల్‌లో 12.5 వేల ఎకరాల విస్తీర్ణంలో 2,500 మెగావాట్ల సామర్థ్యంతో మరొక విద్యుత్ కర్మాగారంను ఎస్‌ఈసీఐ ఏర్పాటుచేయనుంది. మొత్తం రూ.45వేల కోట్ల అంచనా వ్యయంతో 2023 కల్లా ఈ రెండు కర్మాగారాలను నిర్మించనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలోనే అతిపెద్దదైన సౌర విద్యుత్ కర్మాగారం ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : భారత సౌర విద్యుత్ సంస్థ (ఎస్‌ఈసీఐ)
ఎక్కడ : లడఖ్, జమ్మూకశ్మీర్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచంలోనే అతిపెద్దదైన సౌర విద్యుత్ కర్మాగారం ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : భారత సౌర విద్యుత్ సంస్థ (ఎస్‌ఈసీఐ)
ఎక్కడ : లడఖ్, జమ్మూకశ్మీర్
Published date : 14 Jan 2019 04:57PM