లద్దాఖ్‌లో ఇగ్లా క్షిపణుల మోహరింపు
Sakshi Education
భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.తూర్పు లద్దాఖ్‌లోనివాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఇప్పటికే హెలికాప్టర్లను మోహరించి కవ్వింపు చర్యలకు దిగుతోంది.
దీంతో భారత్ బలగాలు ఎక్కడికైనామోసుకుపోగలిగే పోర్టబుల్ ఇగ్లా క్షిపణుల్ని అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో మోహరించాయి. సైనికులు భుజం మీద మోస్తూనే ఈ క్షిపణులతో శత్రువులపై గుళ్ల వర్షం కురిపించవచ్చు. ఈ క్షిపణి వ్యవస్థను ఆర్మీ, వైమానిక దళం వినియోగిస్తాయి. చైనా సైన్యం కదలికల్ని అనుక్షణం కనిపెట్టేందుకు నిఘాను పెంచారు. భూమ్మీద నుంచే గగన తలంలో జరిగే ప్రతీ కదలికను పసిగట్టేందుకు రాడార్లు ఏర్పాటు చేశారు.
రుణరహిత సంస్థగా టాటా మోటార్స్..
వాహనాల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ రాబోయే మూడేళ్లలో రుణభారాన్ని దాదాపు సున్నా స్థాయికి తగ్గించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అలాగే వ్యాపారంపై ఆర్థిక భారాన్ని తగ్గించుకునే క్రమంలో ప్రధాన వ్యాపారేతర పెట్టుబడులను కూడా సొమ్ము చేసుకోవాలని భావిస్తోంది. కంపెనీ 75వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా షేర్‌హోల్డర్లతో టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఆగస్టు 25న ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం టాటా మోటార్స్ గ్రూప్‌నకు రూ. 48,000 కోట్ల రుణభారం ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : పోర్టబుల్ ఇగ్లా క్షిపణుల మోహరింపు
ఎప్పుడు : ఆగస్టు 26
ఎవరు : భారత్ బలగాలు
ఎక్కడ :తూర్పు లద్దాఖ్‌లోనివాస్తవాధీన రేఖ వెంబడి
ఎందుకు :చైనా ఇప్పటికే హెలికాప్టర్లనుమోహరంచడంతో

Published date : 26 Aug 2020 04:51PM