Skip to main content

లద్దాఖ్‌లో గల్వాన్ వీరుల స్మారకం ప్రారంభం

తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో చైనా సైనికులతో పోరాడి మరణించిన 20 మంది అమర వీరుల స్మారకార్థం లద్దాఖ్‌లో భారత ఆర్మీ.. ఓ స్మారకాన్ని నిర్మించిందని ఆర్మీ అధికారులు అక్టోబర్ 3న వెల్లడించారు.
Current Affairs
లద్దాఖ్‌లోని 120వ పోస్ట్‌లో ఈ స్మారకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ స్మారకంపై 20 మంది సైనికుల పేర్లను లిఖించారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ మీద కూడా వీరి పేర్లను లిఖించేందుకు రక్షణ శాఖ సన్నాహాలు చేస్తోంది.

చదవండి: గల్వాన్ లోయలో జూన్ 15న రాత్రి అసలేం జరిగింది?

రుణాలపై చక్రవడ్డీ మాఫీ...
వ్యక్తిగత రుణగ్రహీతలు, చిన్న, మధ్యస్థాయి పరిశ్రమలకు భారీ ఊరట లభించింది. కోవిడ్ నేపథ్యంలో ప్రకటించిన వాయిదాల చెల్లింపుపై మారటోరియంలో ఆయా రుణాల వడ్డీపై వడ్డీ(చక్రవడ్డీ)ని మాఫీ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. రూ.2 కోట్ల వరకు రుణాలపై మారటోరియం విధించిన ఆరు నెలల కాలానికి ఈ రద్దు వర్తింపజేయనున్నట్లు సుప్రీంకోర్టుకు అక్టోబర్ 3న తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో 2020, మార్చి 1 మొదలు ఆగస్టు 31వరకు చెల్లించాల్సిన రుణ వాయిదాలపై ఆర్‌బీఐ మారటోరియం విధించిన విషయం తెలిసిందే.

క్విక్ రివ్యూ :

ఏమిటి : గల్వాన్ వీరుల స్మారకంప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : లద్దాఖ్
ఎందుకు : గల్వాన్ లోయలో చైనా సైనికులతో పోరాడి మరణించిన 20 మంది అమర వీరుల స్మారకార్థం
Published date : 06 Oct 2020 11:47AM

Photo Stories