Skip to main content

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఎవరు ఉన్నారు?

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) చైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో తొమ్మిది నెలలు పొడిగించింది.
Current Affairs
2021 జూన్‌ 30వ తేదీతో కుమార్‌ పదవీకాలం ముగియనుంది. తాజా నిర్ణయంతో ఆయన తన బాధ్యతల్లో 2022 మార్చి 13 వరకూ కొనసాగుతారు. దీనితో ఆయన ఎల్‌ఐసీ చైర్మన్‌గా మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకోగలుగుతారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) చివరినాటికిఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూకు వస్తుందన్న వార్తల నేపథ్యంలో కుమార్‌ పదవీకాలం పొడిగించడం గమనార్హం. రూ.1.75 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా 2021–22లో ఎల్‌ఐసీఐపీఓకు రానున్నట్లు 2021 ఫిబ్రవరి బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఎల్‌ఐసీచైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌మరో తొమ్మిది నెలలుపదవీకాలం పొడిగింపు
ఎప్పుడు : జూన్ 9
ఎవరు :కేంద్ర ప్రభుత్వం
ఎందుకు:2021 జూన్‌ 30వ తేదీతో కుమార్‌ పదవీకాలం ముగియనుండటంతో...
Published date : 10 Jun 2021 06:47PM

Photo Stories