లైన్ ఆఫ్ క్రెడిట్ ఒప్పందం ఏ రెండు దేశాల మధ్య కుదిరింది?
Sakshi Education
రక్షణ రంగంలో ప్రాజెక్టుల కోసం భారత్, మాల్దీవుల మధ్య 5 కోట్ల డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ఒప్పందం కుదిరింది.
మాల్దీవుల ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత్‌కు చెందిన ఎక్స్‌పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకుల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం మాల్దీవులు తమ రక్షణ రంగ అవసరాల కోసం భారత్ బ్యాంకుల నుంచి నిధుల్ని రుణాలుగా తీసుకుంటుంది. ఫిబ్రవరి 21న మాల్దీవుల రాజధాని మాలెలో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, మాల్దీవుల రక్షణ మంత్రి మారియా దీదీ, ఆర్థిక మంత్రి ఇబ్రహీం పాల్గొన్నారు.
మాల్దీవుల్లోని తీరప్రాంత రక్షణ, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా భారత్, మాల్డీవుల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం... మాల్దీవుల్లో రేవులు, డాక్‌యార్డ్‌ల నిర్మాణం, వాటిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, రాడార్ సర్వీసులు, ఆ దేశ నావికాదళానికి శిక్షణ వంటి వాటిలో భారత్ సహకారం అందించనుంది. 2016లో కుదుర్చుకున్న రక్షణ కార్యాచరణ ప్రణాళిక మేరకు ఈ ఒప్పందాలు కుదిరాయి.

మాల్దీవులు రాజధాని: మాలె ; కరెన్సీ: మాల్దీవియన్ రుఫియా
మాల్దీవులు ప్రస్తుత అధ్యక్షుడు: ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్
మాల్దీవులు ప్రస్తుత ఉపాధ్యక్షుడు: ఫైసల్ నసీమ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : 5 కోట్ల డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ఒప్పందం
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : భారత్, మాల్దీవులు
ఎందుకు : మాల్దీవులు తమ రక్షణ రంగ అవసరాల కోసం భారత్ బ్యాంకుల నుంచి నిధుల్ని రుణాలుగా తీసుకునేందుకు...

Published date : 25 Feb 2021 03:00PM