లాల్‌రెమ్‌సియామికి ఎఫ్‌ఐహెచ్ రైజింగ్ స్టార్ అవార్డు
Sakshi Education
భారత మహిళా హాకీ స్ట్రయికర్ లాల్‌రెమ్‌సియామి 2019 ఏడాదికిగాను అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ‘రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికైంది.
అవార్డు ఎంపిక కోసం నిర్వహించిన పోలింగ్‌లో మొత్తం ఓట్లలో 40 శాతం దక్కించుకున్న 19 ఏళ్ల లాల్‌రెమ్‌సియామి.. జులీటా (అర్జెంటీనా), మాల్టా (నెదర్లాండ్‌స)లను వెనక్కి నెట్టి ఈ పురస్కారాన్ని సాధించింది. 2018లో జరిగిన ప్రపంచకప్‌లో విశేషంగా రాణించడం ద్వారా వెలుగులోకి వచ్చిన లాల్‌రెమ్‌సియామి తదనంతరం కూడా నిలకడైన ప్రదర్శనను కొనసాగించింది. మరోవైపు ఎఫ్‌ఐహెచ్ రైజింగ్ స్టార్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా భారత హాకీ క్రీడాకారుడు వివేక్ సాగర్ ప్రసాద్ ఎంపికైన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎఫ్‌ఐహెచ్ రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : లాల్‌రెమ్‌సియామి
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎఫ్‌ఐహెచ్ రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపిక
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : లాల్‌రెమ్‌సియామి
Published date : 12 Feb 2020 05:57PM