ఖతర్ కప్‌లో మీరాబాయి చానుకి స్వర్ణం
Sakshi Education
ఖతర్ రాజధాని దోహాలో జరుగుతున్న ‘ఖతర్ ఇంటర్నేషనల్ కప్ టోర్నమెంట్’లో భారత మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించింది.
డిసెంబర్ 20న జరిగిన మహిళల 49 కేజీల విభాగంలో బరిలో దిగిన చాను 194 (83+111) కేజీల బరువు ఎత్తి అగ్రస్థానంలో నిలిచింది. అనైస్ మిచెల్ (ఫ్రాన్స్-172 కేజీలు), మనోన్ లోరెంజ్ (165 కేజీలు) వరుసగా రజత, కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. రెండో శ్రేణి ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్ అయిన ఖతర్ కప్ టోర్నీలో నెగ్గడం ద్వారా టోక్యో ఒలింపిక్స్‌కు కావాల్సిన కీలకమైన పాయింట్ల సంఖ్యను చాను మెరుగుపర్చుకుంది.
టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందాలంటే ప్రతి వెయిట్‌లిఫ్టర్.. నవంబర్ 2018 నుంచి ఏప్రిల్ 2020లోపు మూడు దశల్లో జరిగే ఈవెంట్లలో కనీసం ఒక్కదాంట్లో అయినా బరిలోకి దిగాలి. ఈ ఈవెంట్లలో కనీసం ఒక స్వర్ణం, ఒక రజతం దక్కించుకోవాలి. ఇప్పటికే చాను థాయ్‌లాండ్‌లో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్ ‘ఈజీఏటీ కప్’ లోనూ స్వర్ణం సాధించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఖతర్ ఇంటర్నేషనల్ కప్ టోర్నమెంట్‌లో స్వర్ణం
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : మీరాబాయి చాను
ఎక్కడ : దోహా, ఖతర్

Published date : 21 Dec 2019 05:56PM