Skip to main content

క్యూబాపై ఆంక్షలకు ఐరాస వ్యతిరేకత

క్యూబాపై అమెరికా వరుసగా 28వ సంవత్సరం కూడా ఆర్థికపరమైన ఆంక్షలు విధించడంపై ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో భారీ వ్యతిరేకత వ్యకమైంది.
ఐరాసలో నవంబర్ 7న జరిగిన చర్చలో మొత్తం 193 దేశాలకుగానూ 187 దేశాలు ఈ చర్యను వ్యతిరేకించాయి. ఈ తీర్మానానికి వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయిల్, బ్రెజిల్ దేశాలు ఓటు చేశాయి. కొలంబియా, ఉక్రెయిన్ దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. ఈ ఓటింగ్‌పై క్యూబా అధ్యక్షుడు మిగుయెల్ డియాజ్-కానెల్ స్పందిస్తూ.. తమపై ఆంక్షలు కొనసాగించడం మానవహక్కుల ఉల్లంఘనేనని ఆరోపించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
క్యూబాపై అమెరికా ఆంక్షలకు వ్యతిరేకత
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : ఐక్యరాజ్యసమితి(ఐరాస)
Published date : 11 Nov 2019 06:02PM

Photo Stories