క్యూఆర్‌సామ్ క్షిపణి పరీక్ష విజయవంతం
Sakshi Education
క్విక్ రెస్పాన్స్ సర్ఫేస్ టు ఎయిర్(క్యూఆర్‌సామ్) క్షిపణి పరీక్ష విజయవంతమైంది.
భారత రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివద్ధి చేసిన ఈ క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్ క్షిపణి పరీక్ష కేంద్రం నుంచి డిసెంబర్ 23న ప్రయోగించారు. క్షిపణి పరీక్షను డీఆర్‌డీవోలోని మిస్సైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ డైరెక్టర్ జనరల్ ఎమ్మెస్సార్ ప్రసాద్ పర్యవేక్షించారు.
క్యూఆర్‌సామ్ విశేషాలు...
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్విక్ రెస్పాన్స్ సర్ఫేస్ టు ఎయిర్(క్యూఆర్‌సామ్) క్షిపణి పరీక్ష విజయవంతం
ఎప్పుడు : డిసెంబర్ 23
ఎవరు : భారత రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ (డీఆర్‌డీవో)
ఎక్కడ : చాందీపూర్ క్షిపణి పరీక్ష కేంద్రం, ఒడిశా
క్యూఆర్‌సామ్ విశేషాలు...
- భూతలం నుంచి గాల్లోని లక్ష్యాన్ని ఛేదించే ఈ క్షిపణి 2021 నాటికి రక్షణ దళాలకు అందుబాటులోకి రానుంది.
- ఈ క్షిపణిని కదిలే వాహనం నుంచి ప్రయోగించవచ్చు. పూర్తిగా ఆటోమేట్ అయిన కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, నిఘా రాడార్, మల్టీఫంక్షన్ రాడార్‌తోపాటు లాంచర్‌లతో కూడి ఉంటుంది.
- రెండు రాడార్లూ అన్నివైపులా చూడగలవు. వాహనం కదులుతూండగానే ఈ పనులు చేయగలగడం మరో ప్రత్యేకత.
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్విక్ రెస్పాన్స్ సర్ఫేస్ టు ఎయిర్(క్యూఆర్‌సామ్) క్షిపణి పరీక్ష విజయవంతం
ఎప్పుడు : డిసెంబర్ 23
ఎవరు : భారత రక్షణ పరిశోధన, అభివద్ధి సంస్థ (డీఆర్‌డీవో)
ఎక్కడ : చాందీపూర్ క్షిపణి పరీక్ష కేంద్రం, ఒడిశా
Published date : 24 Dec 2019 05:53PM