Skip to main content

క్యూఆర్‌ఎస్‌ఏఎం ప్రయోగం విజయవంతం

దేశీయంగా తయారైన అత్యాధునిక క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (క్యూఆర్‌ఎస్‌ఏఎం) వ్యవస్థ నిర్ధేశిత లక్ష్యాన్ని సాధించింది.
Current Affairs
ఈ క్షిపణిని నవంబర్ 13న ఒడిశా రాష్ట్రం బాలాసోర్ జిల్లా చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్టు రేంజ్(ఐటీఆర్) నుంచి భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) శాస్త్రవేత్తలు ప్రయోగించారు. ముందే నిర్ణయించిన పైలట్‌లెస్ టార్గెట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను విజయవంతంగా ఢీకొట్టింది. గగనతలంలో శత్రు యుద్ధ విమానాలను గుర్తించి, నాశనం చేసే సామర్థ్యం క్యూఆర్‌ఎస్‌ఏఎం సొంతం. దీన్ని త్వరలో వైమానిక దళంలో ప్రవేశపెట్టనున్నారు. ఇది 6 చిన్నస్థాయి క్షిపణులను మోసుకుపోగలదు. ప్రస్తుతం డీఆర్‌డీవో చైర్మన్‌గా జీ. సతీష్‌రెడ్డి ఉన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (క్యూఆర్‌ఎస్‌ఏఎం) ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : నవంబర్ 13
ఎవరు : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)
ఎక్కడ : ఇంటిగ్రేటెడ్ టెస్టు రేంజ్(ఐటీఆర్), చాందీపూర్, బాలాసోర్ జిల్లా
ఎందుకు : గగనతలంలో శత్రు యుద్ధ విమానాలను గుర్తించి, నాశనం చేసేందుకు
Published date : 16 Nov 2020 05:43PM

Photo Stories