Skip to main content

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీకి అర్హత సాధించిన క్రీడాకారిణి?

మహిళల ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌–2022 మ్యాచ్‌కు అర్హత టోర్నీ అయిన ప్రపంచ క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌కు భారత స్టార్‌ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి అర్హత సాధించింది.
Current Affairs
2019–2021 మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ హంపి 293 పాయింట్లతో ఓవరాల్‌గా రెండో స్థానంలో నిలువడంతో ఆమెకు క్యాండిడేట్స్‌ టోర్నీ బెర్త్‌ ఖరారైంది. హంపితోపాటు కాటరీనాలాగ్నో (రష్యా–280 పాయింట్లు), గత ప్రపంచ చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌లో రన్నరప్‌గా నిలిచిన అలెక్సాండ్రాగోర్యాచ్‌కినా (రష్యా) కూడా క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత పొందారు. గ్రాండ్‌ప్రి సిరీస్‌లోని నాలుగు టోర్నీలలో చివరిదైన జిబ్రాల్టర్‌ టోర్నీ జూన్ 2న ముగిసింది. ఈ టోర్నీలో హంపి ఆడకపోయినా గతంలో ఆమె ఆడిన రెండు గ్రాండ్‌ప్రి టోర్నీలలో అద్భుత ప్రదర్శన చేసింది.

2022 ఏడాది తొలి అర్ధ భాగంలో జరిగే క్యాండిడేట్స్‌ టోర్నీలో మొత్తం ఎనిమిది మంది పాల్గొంటారు. ఈ టోర్నీ విజేత 2022 ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జూ వెన్‌జున్‌ (చైనా)తో తలపడుతుంది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ప్రపంచ క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌కుఅర్హత సాధించిన క్రీడాకారిణి?
ఎప్పుడు :జూన్ 2
ఎవరు :భారత స్టార్‌ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి
ఎందుకు :2019–2021 మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ హంపి 293 పాయింట్లతో ఓవరాల్‌గా రెండో స్థానంలో నిలువడంతో...
Published date : 04 Jun 2021 02:41PM

Photo Stories