Skip to main content

క్యాచ్ ది రెయిన్ 100 రోజుల ప్రచార కార్యక్రమం ప్రారంభం

వాన నీటిని పూర్తిగా సద్వినియోగం చేయడం కోసం చెరువులు, కాల్వలు నిర్వహణపై కేంద్ర జల మంత్రిత్వ శాఖ... జలశక్తి అభియాన్–‘క్యాచ్ ద రెయిన్’ అనే 100 రోజుల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Current Affairs
మార్చి 22న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సర్పంచులు, వార్డు సభ్యులనుద్దేశించి మోదీ మాట్లాడుతూ... వర్షాకాలం సమీపించే లోగా చెరువులు, బావుల సామర్థ్యాన్ని పెంచేందుకు పూడికతీసి, శుభ్రం చేసి సిద్ధంగా ఉంచాలనీ, ఈ పనులకు ఉపాధి హామీ పథకం నిధులను పూర్తిగా వినియోగించుకోవాలని తెలిపారు. క్యాచ్‌ ద రెయిన్‌ కార్యక్రమం మార్చి 22 నుంచి నవంబర్‌ 30వ తేదీ వరకు అమలు చేస్తామన్నారు.

కెన్‌–బెత్వా నదుల అనుసంధానం...
‘కెన్‌–బెత్వా’నదుల అనుసంధానం ప్రాజెక్టు కార్యరూపం తీసుకురావడానికి మార్చి 22న ఒప్పంద పత్రాలపై ప్రధాని మోదీ సమక్షంలో ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌లు సంతకం చేశారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : జలశక్తి అభియాన్‌–క్యాచ్‌ ది రెయిన్‌ 100 రోజుల ప్రచార కార్యక్రమం ప్రారంభం
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా
ఎందుకు : దేశవ్యాప్తంగా వాన నీటిని పూర్తిగా సద్వినియోగం చేయడం కోసం
Published date : 23 Mar 2021 06:22PM

Photo Stories