Skip to main content

కువైట్ రాజుగా బాధ్యతలు చేపట్టనున్న వ్యక్తి?

ఏళ్ల తరబడి కువైట్‌ను పాలించిన రాజు(ఎమిర్ ఆఫ్ కువైట్) షేక్ సబా అల్ అహ్మద్ అల్ జాబెర్ అల్ సబా(91) సెప్టెంబర్ 29న అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రం రోచెస్టర్ నగరంలో కన్నుమూశారు.
Current Affairs
కువైట్‌లోని కువైట్ నగరంలో 1929, జూన్ 16న జన్మించిన షేక్ సబా.... 2006, జూన్ 29 కువైట్ రాజుగా ఎన్నికయ్యారు. 1990లో జరిగిన గల్ఫ్ యుద్ధం తర్వాత ఇరాక్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించడంలో, ఇతరత్రా ప్రాంతీయ సంక్షోభాలకు పరిష్కారాలు చూపడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా అరబ్ దేశాల మధ్య తలెత్తిన వివాదాలను తన దౌత్యం ద్వారా పరిష్కరిస్తూ వచ్చారు.

కువైట్ తదుపరి రాజుగా...
కువైట్ తదుపరి రాజుగా షేక్ సబా సవతి సోదరుడు, యువరాజు షేక్ నవాఫ్ అల్‌అహ్మద్ అల్ సబా బాధ్యతలు చేపట్టనున్నారు.

కువైట్ రాజధాని నగరం: కువైట్ సిటీ
కరెన్సీ: కువైట్ దినార్

క్విక్ రివ్యూ :

ఏమిటి : కువైట్ రాజు(ఎమిర్ ఆఫ్ కువైట్) కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 29
ఎవరు : షేక్ సబా అల్ అహ్మద్ అల్ జాబెర్ అల్ సబా(91)
ఎక్కడ : రోచెస్టర్, మిన్నెసోటా రాష్ట్రం, అమెరికా
Published date : 01 Oct 2020 12:40PM

Photo Stories