Skip to main content

కుందూ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన

రూ.2,300 కోట్లతో చేపట్టిన రాజోలి ప్రాజెక్టు, జొలదరాశి ప్రాజెక్టు, కుందూ – బ్రహ్మంసాగర్‌ ఎత్తిపోతల పథకాలతోపాటు మరికొన్ని అభివద్ధి పనులకు వైఎస్సార్‌ జిల్లా దువ్వూరు మండలం నేలటూరు వద్ద ఆంధ్రప్రదేశ్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్‌ 23న శంకుస్థాపన చేశారు.
Current Affairs ఏటా గోదావరి నుంచి మూడు వేల టీఎంసీల వరద జలాలు సముద్రం పాలవుతున్నాయని, వరద వచ్చిన 40 – 50 రోజుల్లోపే ఆ నీటిని ఒడిసి పట్టేందుకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం జగన్‌ చెప్పారు. గోదావరి నీటిని బల్లేపల్లె నుంచి బనకచర్ల వరకు.. పెన్నా బేసిన్‌కు తరలించేందుకు శ్రీకారం చుట్టామన్నారు.

మరోవైపు కడప రిమ్స్‌లో రూ.107 కోట్లతో క్యాన్సర్‌ కేర్‌ సెంటర్, రూ.175 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్, రూ.40.81 కోట్లతో మానసిక చికిత్సాలయం, ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే కడప – రాయచోటి రోడ్డులో రూ.82.73 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని ప్రారంభించారు.

ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులివీ..
  • కర్నూలు, వైఎస్సార్‌ జిల్లాల సరిహద్దులో కుందూనదిపై రూ.1357 కోట్లతో 2.95 టీఎంసీల సామర్థ్యంతో రాజోలి ప్రాజెక్టు. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల వద్ద రూ.312 కోట్లతో 0.8 టీఎంసీల సామర్థ్యంతో జొలదరాశి ప్రాజెక్టు.
  • దువ్వూరు మండలం జొన్నవరం వద్ద రూ.564 కోట్లతో కుందూ నది నుంచి తెలుగంగ ఎస్‌ఆర్‌–1 ద్వారా బ్రహ్మంసాగర్‌కు నీటిని అందించే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వల్ల తెలుగుగంగ కింద 91వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతోపాటు మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల్లోని తాగునీటి అవసరాలు తీరతాయి.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
కుందూ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
ఎప్పుడు : డిసెంబర్‌ 23
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : నేలటూరు, దువ్వూరు మండలం, వైఎస్సార్‌ జిల్లా
Published date : 24 Dec 2019 05:58PM

Photo Stories