Skip to main content

కఠువా కేసులో పఠాన్‌కోట్ కోర్టు తీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కఠువా సామూహిక అత్యాచారం, హత్య కేసులో పంజాబ్‌లోని పఠాన్‌కోట్ సెషన్‌‌స కోర్టు న్యాయమూర్తి తేజ్వీందర్ సింగ్ జూన్ 10న తీర్పు వెలువరించారు.
ఈ కేసులోని ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులగా తేల్చిన కోర్టు.. వారిలో వారిలో ముగ్గురికి యావజ్జీవ శిక్ష (జీవితఖైదు), ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రధాన నిందితుడు సంజీరామ్ కొడుకు అయిన విశాల్‌ను కోర్టు సరైన సాక్ష్యాలు లేని కారణంగా నిర్దోషిగా విడుదల చేసింది.

ఈ కేసులో ఆలయ సంరక్షకుడు సంజీరామ్, ప్రత్యేక పోలీస్ అధికారి (ఎస్పీవో) దీపక్ ఖజూరియాతోపాటు మరో వ్యక్తి ప్రవేశ్‌కుమార్‌లను దోషులగా తేల్చిన కోర్టు వీరికి జీవిత ఖైదు విధించింది. అలాగే మరో ఎస్పీవో సురేంద్ర వర్మ, ఎస్సై ఆనంద్ దత్తా, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్‌లు సాక్ష్యాలను నాశనం చేశారంటూ వారికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 50 వేల జరిమానా విధించింది. జరిమానా కట్టలేకపోతే మరో ఆరునెలలు ఎక్కువగా జైలు జీవితం గడపాలని ఆదేశించింది.

జమ్మూకశ్మీర్‌లోని కఠువా జిల్లాలోని రసనా గ్రామంలో 2018, జనవరిలో బకర్వాల్ సంచార జాతికి చెందిన 8 ఏళ్ల బాలికపై ఓ ఆలయంలో సామూహిక అత్యాచారం, హత్య జరిగింది. బాలికను అపహరించి, ఆలయంలో బంధించి, నాలుగురోజుల పాటు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన అనంతరం బండరాళ్లతో మోదీ హత్య చేశారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ దుర్ఘటనపై దేశవ్యాప్త నిరసనలు వెల్లువెత్తాయి. మొదటగా కఠువాలో ప్రధాన సెసన్‌‌స కోర్టు జడ్జి ముందు ఈ కేసు విచారణ ప్రారంభం అయింది. అయితే కఠువా నుంచి పంజాబ్‌లోని పఠాన్‌కోట్ కోర్టుకు ఈ కేసును సుప్రీంకోర్టు బదీలి చేసింది. విచారణను రహస్యంగా, వేగవంతంగా, మీడియాకు దూరంగా చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసుపై విచారణ చేపట్టిన పఠాన్‌కోట్ కోర్టు జూన్ 10 తీర్పు వెలువరించింది. రణ్‌బీర్ పీనల్ కోడ్ (ఆర్పీసీ) కింద ఆరుగురిని దోషులుగా కోర్టు తేల్చింది.
Published date : 11 Jun 2019 06:52PM

Photo Stories