Skip to main content

కఠ్మాండూలో దక్షిణాసియా క్రీడలు ప్రారంభం

నేపాల్ రాజధాని కఠ్మాండూలో 13వ దక్షిణాసియా క్రీడలు ప్రారంభమయ్యాయి.
Current Affairsనేపాల్ దేశాధ్యక్షురాలు విద్యాదేవి భండారి డిసెంబర్ 1న ఈ క్రీడలను ప్రారంభించారు. 10 రోజులపాటు జరిగే ఈ క్రీడల్లో భారత్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్, మాల్దీవులు దేశాల నుంచి 2,715 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. మొత్తం 26 క్రీడాంశాల్లో 1119 పతకాల కోసం క్రీడాకారులు పోటీపడతారు. భారత్ నుంచి 487 మంది క్రీడాకారులు ఈ క్రీడల్లో బరిలో ఉన్నారు. 2016 దక్షిణాసియా క్రీడల్లో భారత్ 188 స్వర్ణాలు, 90 రజతాలు, 30 కాంస్యాలతో కలిపి మొత్తం 308 పతకాలు సాధించింది.

పతాకధారిగా తేజిందర్
దక్షిణాసియా క్రీడల ప్రారంభోత్సవంలో భారత బృందానికి పతాకధారిగా షాట్‌పుట్ క్రీడాకారుడు తేజిందర్ సింగ్ పాల్ తూర్ వ్యవహరించనున్నాడు. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో 25 ఏళ్ల తేజిందర్ స్వర్ణ పతకం సాధించాడు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
13వ దక్షిణాసియా క్రీడలుప్రారంభం
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : నేపాల్ దేశాధ్యక్షురాలు విద్యాదేవి భండారి
ఎక్కడ : కఠ్మాండూ, నేపాల్
Published date : 02 Dec 2019 05:41PM

Photo Stories