కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి
Sakshi Education
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఫిబ్రవరి 14న ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.
ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దాడిలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీర మరణం పొందగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా సీఆర్పీఎఫ్ 76వ బెటాలియన్‌కు చెందిన వారని ఆర్మీ అధికారులు తెలిపారు.
ఈ దాడిని తామే చేశామని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ ప్రకటించుకుంది. తమ కమాండర్ ఆదిల్ అహ్మద్ దార్ అలియాస్ వకాస్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. సెలవుల ముగించుకొని మళ్లీ విధుల్లో చేరేందుకు 2,547 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు దాదాపు 78 వాహనాల్లో జమ్మూ నుంచి శ్రీనగర్‌కు బయలుదే రగా ఈ దాడి జరిగింది. 2001, అక్టోబర్ 1న జమ్మూకశ్మీర్ అసెంబ్లీపై జైషే ఉగ్రవాదులు చేసిన దాడి తర్వాత భద్రతాబలగాలు భారీస్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. 2016, సెప్టెంబర్ 18న కశ్మీర్‌లో ఉడీ ఆర్మీ బేస్‌పై జరిగిన ఉగ్రదాడి ఘటనలో 19 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి
ఎప్పుడు : ఫిబ్రవరి 14
ఎవరు : జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ
ఎక్కడ : లెత్‌పొరా, అవంతిపొరా, పుల్వామా జిల్లా, జమ్మూకశ్మీర్

Published date : 15 Feb 2019 05:42PM