Skip to main content

కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు

జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలో జూన్ 12న సమావేశమైన కేబినెట్ ఆమోదం తెలిపింది.
జమ్మూకశ్మీర్‌లో 2018 జూన్ 20వ తేదీ నుంచి రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. అమర్‌నాథ్ యాత్ర ముగిసిన తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తామంటూ ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలనకు ఇదే ఆఖరి పొడిగింపు కావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత గడువు జూలై 2వ తేదీతో ముగియనుండగా తాజా పొడిగింపు జూలై 3వ తేదీ నుంచి అమలు కానుంది. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ మేరకు ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు
ఎప్పుడు : జూన్ 12
ఎవరు : కేంద్ర కేబినెట్
Published date : 13 Jun 2019 05:44PM

Photo Stories