Skip to main content

కశ్మీర్‌లో పంచాయతీరాజ్ చట్టం అమలుకు కేబినెట్ ఆమోదం

జమ్మూకశ్మీర్‌లో పంచాయతీరాజ్ చట్టం- 1989 అమలు ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ అక్టోబర్ 21న ఆమోదించింది.
Current Affairs
దీంతో మూడంచెల పంచాయతీరాజ్ విధానం కశ్మీర్లోనూ అమలు కానుంది. కశ్మీర్‌లో నాఫెడ్ (నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్) ద్వారా 12 లక్షల టన్నుల యాపిల్‌ను సేకరించే పథకాన్ని 2020-21 సీజన్‌లో కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు నాఫెడ్ వద్ద ప్రభుత్వ హామీగా ఉన్న రూ. 2500 కోట్లను వినియోగించేందుకు అనుమతించింది.

ఉద్యోగులకు రూ. 3,737 కోట్ల బోనస్..
దసరా సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. సుమారు 30.67 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 3,737 కోట్ల బోనస్‌ను అందజేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2019-2020 సంవత్సరానికి గానూ ఉద్యోగులకు ఉత్పాదకత ఆధారిత బోనస్ (ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్- పీఎల్‌బీ), ఉత్పాదకతకు సంబంధం లేని బోనస్ (నాన్ పీఎల్‌బీ లేదా అడ్‌హాక్) ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి జవదేకర్ వెల్లడించారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : జమ్మూకశ్మీర్‌లో పంచాయతీరాజ్ చట్టం- 1989 అమలు ప్రతిపాదనను ఆమోదం
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : కేంద్ర కేబినెట్
Published date : 22 Oct 2020 05:55PM

Photo Stories