కశ్మీర్ ఈడబ్ల్యూఎస్ కోటాకు ఆమోదం
Sakshi Education
ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కశ్మీర్‌కు చెందిన ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్ జూలై 31న ఆమోదం తెలిపింది.
ఇప్పుడున్న రిజర్వేషన్లకు తోడుగా ‘కశ్మీర్ ఈడబ్ల్యూఎస్’ కోటాను అమలుచేయనున్నట్లు వెల్లడించింది. మరోవైపు, ఓబీసీల్లో ఉపవర్గాలపై అధ్యయనానికి జస్టిస్ రోహిణి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ కాల పరిమితిని 2020 ఏడాది జనవరి 31 వరకు గడువు పెంచింది.
ఇస్రోకు రష్యా రాజధాని మాస్కోలో టెక్నికల్ లైజాన్ యూనిట్ ఏర్పాటు చేయాలని కూడా కేబినేట్ నిర్ణయించింది. రష్యా, చుట్టుపక్కల దేశాలతో అంతరిక్ష సంబంధాలు పెంచుకోవడానికి ఈ యూనిట్‌ను వినియోగించనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కశ్మీర్ ఈడబ్ల్యూఎస్ కోటాకు ఆమోదం
ఎప్పుడు : జూలై 31
ఎవరు : కేంద్ర కేబినెట్

Published date : 01 Aug 2019 05:51PM