Skip to main content

కశ్మీర్ డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఎన్నికల ఫలితాలు

జమ్మూ కశ్మీర్ డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి.
Current Affairs

ఎన్నికల కమిషన్ డిసెంబర్ 23న వెల్లడించిన వివరాల ప్రకారం... మొత్తం 20 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు 14 చొప్పున 280 సీట్లకు 8 దశల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో పీఏజీడీ(గుప్కార్ కూటమి) 110 స్థానాల్లో గెలుపొంది అగ్రస్థానంలో నిలిచింది. 75 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచిన సింగిల్ పార్టీగా అవతరించింది. మరో రెండు స్థానాల ఫలితాలు ఇంకా వెలువడాల్సిఉంది. ఈరెండు చోట్ల పోటీ చేసిన అభ్యర్థ్ధుల్లో పీఓకేకు చెందిన వారుండడంతో ఫలితాల ప్రకటన నిలిపారు. ఆర్టికల్ 370 అధికరణ రద్దు తర్వాత కశ్మీర్‌లో జరిగిన తొలి డీడీసీ ఎన్నికలు ఇవే.

మీకు తెలుసా: ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎవరు ఉన్నారు? లద్దాఖ్ రాజధాని నగరం ఏది? 

Published date : 24 Dec 2020 06:38PM

Photo Stories