కృత్రిమంగా అంగారక వాతావరణాన్ని సిద్ధం చేస్తోన్న సంస్థ?
Sakshi Education
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఒక ప్రయోగాన్ని చేపట్టింది. అంగారకుడిపై ఉండే వాతావరణాన్ని మనిషి తట్టుకుండాలో లేదో అధ్యయనం చేసేందుకు భూమిపైనే కృత్రిమంగా అంగారక వాతావరణాన్ని సిద్ధం చేస్తోంది. ఈ కృత్రిమ అంగారక వాతావరణంలో ఉంటూ ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో, వాటికి ఎలా సిద్ధమవ్వాలో అధ్యయనం చేస్తారు.
డ్యూన్ ఆల్ఫా...
మార్స్ డ్యూన్ ఆల్ఫాగా పిలిచే 1700 చదరపు అడుగుల ఈ కృత్రిమ నివాస స్థలాన్ని అంగారకుడి వాతావరణాన్ని అనుసరించి 3డీ ప్రింటింగ్ ద్వారా సృష్టిస్తున్నారు. హూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌లో ఈ కృత్రిమ కుజ నివాసం సిద్ధం చేస్తున్నారు. కుజుడిపై ఉండేలాగానే పరిమిత వనరులు, పరికరాలు ఫెయిల్‌కావడం, కమ్యూనికేషన్ తెగిపోవడం, ఇతర సహజసిద్ధ ప్రమాదాలు ఆల్ఫాలో ఉంటాయి. ఈ ప్రయోగంతో లభించే వివరాలు నిజమైన అంగారకుడిపైకి మనిషిని పంపేందుకు ఉపకరిస్తాయని నాసా భావిస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కృత్రిమంగా అంగారక వాతావరణాన్ని సిద్ధం చేస్తోన్న సంస్థ?
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : నాసా
ఎక్కడ : జాన్సన్ స్పేస్ సెంటర్, హూస్టన్, అమెరికా
ఎందుకు : అంగారకుడిపై ఉండే వాతావరణాన్ని మనిషి తట్టుకుండాలో లేదో అధ్యయనం చేసేందుకు...
Published date : 10 Aug 2021 01:24PM