కృష్ణా, గోదావరి కెనాల్స్ వెబ్‌సైట్ ప్రారంభం
Sakshi Education
మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా అండ్ గోదావరి కెనాల్స్ అంశానికి సంబంధించిన ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 19న ప్రారంభించారు.
సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ... మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా అండ్ గోదావరి కెనాల్స్ ద్వారా కాలుష్యానికి గురైన కాలువలను కాలుష్య రహితంగా తీర్చిదిద్ది ఆధునికీకరించడమే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. సాగు, తాగుకు స్వచ్ఛమైన నీటిని అందించడమే ఈ మిషన్ లక్ష్యమని.. కృష్టా, గోదావరి నదులపై ఉన్న నగర, గ్రామీణ ప్రాంతాల్లోని కాలువలను శుద్ధి చేయడమే లక్ష్యంగా పనులు చేయాలని అధికారులకు సూచించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా అండ్ గోదావరి కెనాల్స్ వెబ్‌సైట్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎందుకు : కాలుష్యానికి గురైన కాలువలను కాలుష్య రహితంగా తీర్చిదిద్ది ఆధునికీకరించేందుకు

Published date : 21 Feb 2020 06:00PM