Skip to main content

కర్తార్‌పూర్ ప్రారంభోత్సవానికి మన్మోహన్

భారత్, పాకిస్తాన్‌లను కలిపే కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ ప్రారంభోత్సవానికి మాజీ ప్రధాని మన్మోహన్ హాజరుకానున్నారు.
కారిడార్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని తొలి విడత సిక్కు యాత్రికులతో కలిసి పాక్‌లోని కర్తార్‌పూర్ గురుద్వారాకు వెళ్లాల్సిందిగా పంజాబ్ సీఎం అమరీందర్ కోరడంతో అందుకు మన్మోహన్ అంగీకరించారు. పాక్‌లోని లోథిలో సుల్తాన్‌పూర్‌లో జరిగే గురునానక్ 550 జయంతి ఉత్సవాలకు కూడా మన్మోహన్ హాజరుకానున్నారు.

సిక్కుల పవిత్ర యాత్రా స్థలాలైన పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా, భారత్‌లోని గురుదాస్‌పూర్ డేరాబాబా నానక్ గురుద్వారాను కర్తార్‌పూర్ కారిడార్ కలుపుతుంది. ఈ కారిడార్ ద్వారా భారత్‌లో సిక్కు యాత్రికులు వీసా అనుమతులు లేకుండా కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాను సందర్శించవచ్చును. సిక్కు మత వ్యవస్థాపకుడు బాబా గురునానక్ 550వ జయంతి నవంబర్12న ఉన్న నేపథ్యంలో నవంబర్ 9న కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించాలని పాక్ నిర్ణయించింది.
Published date : 04 Oct 2019 05:39PM

Photo Stories