Skip to main content

కర్తార్‌పూర్ కారిడార్‌కు మన్మోహన్ సింగ్

భారత్, పాకిస్తాన్ మధ్య ఒక మైలురాయిగా భావించే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానించాలని పాకిస్తాన్ నిర్ణయించింది.
ఈ విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషి సెప్టెంబర్ 30న వెల్లడించారు.

సిక్కుల పవిత్ర యాత్రా స్థలాలైన పాకిస్తాన్‌లోని దర్బార్ సాహిబ్‌ను భారత్‌లోని డేరా బాబా నానక్ మందిరంతో కర్తార్‌పూర్ కారిడార్ కలుపుతుంది. దీంతో భారత్‌లో సిక్కు యాత్రికులు వీసా అనుమతులు లేకుండా దర్బార్ సాహిబ్ సందర్శించవచ్చును. సిక్కు మత వ్యవస్థాపకుడు బాబా గురునానక్ 550వ జయంతి నవంబర్12న ఉన్న నేపథ్యంలో నవంబర్ 9న కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించాలని పాక్ నిర్ణయించింది.
Published date : 01 Oct 2019 05:35PM

Photo Stories