Skip to main content

క్రొయేసియాలో భారీ భూకంపం

క్రొయేసియాను భారీ భూకంపం కుదిపేసింది. దేశ రాజధాని జగ్రెబ్‌లో మార్చి 22న సంభవించిన ఈ భూకంపంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
Current Affairs అలాగే భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ‘రిక్టరు స్కేలుపై 5.3 తీవ్రతతో జగ్రెబ్‌లో మార్చి 22న ఉదయం 6.23 గంటలకు భూకంపం సంభవించింది. 140 ఏళ్లలో ఇదే అతిపెద్ద భూకంపం’ అని ఆ దేశ ప్రధాని అంద్రేజ్ ప్లెన్‌కోవిక్ తెలిపారు. కరోనా కారణంగా జగ్రెబ్‌లో ఇప్పటికే లాక్‌డౌన్ ప్రకటించారు.

కోవిడ్ మరణాలు 13 వేలు
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,08,130 మందికి వ్యాధి సోకగా మార్చి 22న ఒక్కరోజే 1,702 మృతి చెందడంతో మొత్తం మరణాలు 13,444కు చేరుకున్నారుు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్రొయేసియాలో భారీ భూకంపం
ఎప్పుడు : మార్చి 2
ఎక్కడ : జగ్రెబ్, క్రొయేసియా
Published date : 23 Mar 2020 06:28PM

Photo Stories