క్రొయేషియా అధ్యక్ష ఎన్నికల్లో మిలనోవిక్ విజయం
Sakshi Education
క్రొయేషియా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో క్రొయేషియా మాజీ ప్రధాని, సోషల్ డెమోక్రట్ పార్టీ నేత జోరన్ మిలనోవిక్ విజయం సాధించారు.
జనవరి 6న వెల్లడైన ఫలితాల ప్రకారం.. మిలనోవిక్‌కు 52.7 శాతం ఓట్లు వచ్చాయి. ఆయన సమీప రాజకీయ ప్రత్యర్థి, సిట్టింగ్ ప్రెసిడెంట్ కొలిండా గ్రాబర్ కిటారోవిక్‌కు 47.3శాతం ఓట్లు వచ్చాయి. మితవాద భావజాలమున్న కిటారోవిక్ కన్జర్వేటివ్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 40 లక్షలకు పైగా జనాభా కలిగిన క్రొయేషియా 1991లో స్వతంత్య్ర రాజ్యంగా ఆవిర్భవించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్రొయేషియా అధ్యక్ష ఎన్నికల్లోవిజయం
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : జోరన్ మిలనోవిక్
మాదిరి ప్రశ్నలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : క్రొయేషియా అధ్యక్ష ఎన్నికల్లోవిజయం
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : జోరన్ మిలనోవిక్
మాదిరి ప్రశ్నలు
1. క్రొయేషియా రాజధాని నగరం, కరెన్సీ(వరుసగా)ని గుర్తించండి.
1. హవానా, దినార్
2. జాగ్రెబ్, కునా
3. నికోసియా, యూరో
4. ప్రేగ్, చెక్ కొరునా
- View Answer
- సమాధానం : 2
2. 18వ అలీనోద్యమ దేశాల సదస్సు 2019, అక్టోబర్ 25, 26 తేదీల్లో ఎక్కడ జరిగింది?
1. బాకు
2. తిరానె
3. మనామా
4. ఢాకా
- View Answer
- సమాధానం : 1
Published date : 07 Jan 2020 05:40PM