కరోనాతో పాక్ మాజీ క్రికెటర్ జాఫర్ మృతి
Sakshi Education
పాకిస్తాన్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ కరోనా మహమ్మారికి బలయ్యాడు.
పాక్ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. 50 ఏళ్ల జాఫర్ పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ ఏప్రిల్ 13న కన్నుమూశారు. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్ అయిన జాఫర్ సర్ఫరాజ్ తన కెరీర్‌లో 6 వన్డేలు ఆడి 96 పరుగులు చేశాడు. 1988 నుంచి 94 వరకు 15 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో పెషావర్‌కు ప్రాతినిధ్యం వహించి 616 పరుగులు, 1990 నుంచి 92 వరకు లిస్ట్ ఏ క్రికెట్ ఆడాడు. రిటైర్మంట్ అనంతరం జాఫర్ సీనియర్ జట్టుతో పాటు అండర్-19 జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. జాఫర్ సర్ఫరాజ్ సోదరుడు అక్తర్ సర్ఫరాజ్ కూడా 1997-98 మధ్యలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనాతో పాక్ మాజీ క్రికెటర్ మృతి
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : జాఫర్ సర్ఫరాజ్(50)
ఎక్కడ : పెషావర్, పాకిస్తాన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనాతో పాక్ మాజీ క్రికెటర్ మృతి
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : జాఫర్ సర్ఫరాజ్(50)
ఎక్కడ : పెషావర్, పాకిస్తాన్
Published date : 15 Apr 2020 07:02PM