Skip to main content

కరోనాతో మాజీ ఫుట్‌బాలర్‌ హమ్జా మృతి

జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ సంతోష్ ట్రోఫీలో మహారాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కేరళ ఫుట్‌బాల్ ప్లేయర్ హమ్జా కోయా(61) జూన్ 6న కరోనా వైరస్‌తో మృతి చెందారు.
Current Affairs
శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న హమ్జా మలప్పురం జిల్లాలోని మంజేరి మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. 61 ఏళ్ల హమ్జా 1981 నుంచి 1986 వరకు సంతోష్ ట్రోఫీలో మహారాష్ట్ర తరఫున బరిలోకి దిగారు. అంతేకాకుండా దేశంలోని ప్రముఖ పుట్‌బాల్ క్లబ్‌లు మోహన్ బగాన్, మొహమ్మదన్ స్పోర్టిం గ్ జట్ల తరఫున ఆడారు. రెండుసార్లు భారత ఫుట్‌బాల్ శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు.

బీబీసీ నుంచి వైదొలిగిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)తో 14 ఏళ్ల అనుబంధాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్‌కాట్ తెంచుకున్నాడు. ‘బీబీసీ టెస్టు మ్యాచ్ ప్రత్యేక కామెంటరీ బృందం’ నుంచి 79 ఏళ్ల బాయ్‌కాట్ తప్పుకున్నాడు. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు బాయ్‌కాట్ తెలిపాడు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : కరోనాతో మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ మృతి
ఎప్పుడు : జూన్ 6
ఎవరు : హమ్జా కోయా(61)
ఎక్కడ : మంజేరి మెడికల్ కాలేజీ ఆసుపత్రి, మలప్పురం జిల్లా, కేరళ
Published date : 08 Jun 2020 05:13PM

Photo Stories