Skip to main content

క‌రోనాతో లోక్‌పాల్‌ సభ్యుడు త్రిపాఠీ కన్నుమూత

లోక్‌పాల్‌ సభ్యుడు జస్టిస్‌(రిటైర్డు) ఏకే త్రిపాఠీ(62) కరోనా వైరస్‌ సోకి చనిపోయారు.
Current Affairsకోవిడ్‌తో చికిత్స పొందుతూ ఎయిమ్స్‌లో మే 2న కన్నుమూశారని అధికారులు తెలిపారు. 1957 నవంబర్ 12న జన్మించిన త్రిపాఠి.. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో ఎకనమిక్స్ చదివారు. అనంతరం ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. 1981లో పట్నా హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. బిహార్ అడిషనల్ అడ్వొకేట్ జనరల్‌గా పని చేసిన ఏకే త్రిపాఠి.. పాట్నా హైకోర్ట్ అడిషనల్ జడ్జిగానూ సేవలు అందించారు. 2018లో జులైలో ఛత్తీస్‌గఢ్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అవినీతి వ్యతిరేక స్వతంత్ర సంస్థ అయిన ‘లోక్‌పాల్’లోని నలుగురు జ్యుడీషియల్ సభ్యుల్లో ఒకరిగా.. 2019 మార్చి 23న నియమితులయ్యారు.
Published date : 04 May 2020 07:34PM

Photo Stories