కరోనాపై పోరుకు పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటు
Sakshi Education
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా ఏదైనా అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టడం, బాధితులకు ఉపశమనం అందించడం లాంటి ప్రాథమిక లక్ష్యంతో కూడిన జాతీయ నిధిని ఉండాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాన మంత్రి పౌర సహాయ, అత్యవసర పరిస్థితుల ఉపశమన నిధి (పీఎం కేర్స్)ని ఏర్పాటు చేశారు.
ప్రధానమంత్రి ఛైర్మన్‌గా ఉండే ఈ ట్రస్ట్ లో రక్షణ, హోం, ఆర్థిక శాఖల మంత్రులు సభ్యులుగా ఉంటారని మార్చి 28న కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఫండ్ చిన్న చిన్న విరాళాలను కూడా అనుమతిస్తుంది. పౌరులు లేదా సంస్థలు పీఎం ఇండియా డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్‌సైట్ ద్వారా పై వివరాలను ఉపయోగించి పి.ఎం. కేర్స్ ఫండ్‌కు విరాళాలు అందించవచ్చు.
టాటా గ్రూప్ విరాళం రూ. 1,500కోట్లు..
కరోనాపై యుద్ధానికి టాటా గ్రూప్ మార్చి 28న భారీ విరాళం ప్రకటించింది. రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు తొలుత టాటా ట్రస్టు వెల్లడించింది.అనంతరం రూ.1,000 కోట్ల విరాళాన్ని ‘టాటా సన్స్’ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ప్రకటించారు. దీంతో టాటా గ్రూప్ మొత్తం రూ.1,500 కోట్ల విరాళం ప్రకటించినట్లయింది.

Published date : 30 Mar 2020 06:46PM