కరోనాపై పోరుకు ఆపరేషన్ నమస్తే కార్యక్రమం
Sakshi Education
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోనేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవాణే ‘ఆపరేషన్ నమస్తే’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు.
సైన్యం చేపట్టే ఈ కార్యక్రమం ద్వారా కరోనాపై పోరులో ప్రభుత్వానికి సాయం అందించడంతోపాటు పాక్, చైనా సరిహద్దుల్లోని 13 లక్షల మంది సైనికులు, వారి కుటుంబాలు వైరస్ బారిన పడకుండా చర్యలు తీసుకోనున్నారు. ‘మీ కుటుంబాల సంక్షేమం గురించి మేం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని సరిహద్దులోని జవాన్లకు హామీ ఇస్తున్నాను. ఈ కార్యక్రమంలో మేం విజయం సాధిస్తాం’ అని నరవాణే మార్చి 27న తెలిపారు.
Published date : 28 Mar 2020 06:51PM