Skip to main content

కరోనాపై నేషనల్‌ క్లినికల్‌ రిజిస్ట్రీ ఏర్పాటు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ బారినపడి, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల సమగ్ర సమాచారంతో ఒక రిజిస్ట్రీని ఏర్పాటు చేయాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) నిర్ణయించింది.

Current Affairsదీనిద్వారా వారికి అందిస్తున్న చికిత్సను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, మరింత చికిత్స అందించేందుకు వీలవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ, ఢిల్లీ ఎయిమ్స్‌ భాగస్వామ్యంతో నేషనల్‌ క్లినికల్‌ రిజిస్ట్రీని ఐసీఎంఆర్‌ ఏర్పాటు చేయనుంది. ఆసుపత్రుల్లోని బాధితుల సమాచారాన్ని 15 జాతీయ స్థాయి సంస్థలు సేకరించి, రిజిస్ట్రీకి అందజేస్తాయి.

కరోనా అందరికీ సోకదు: ఐఐపీహెచ్‌
కరోనా సోకిన వ్యక్తి ఉన్న కుటుంబంలో అందరికీ ఆ వైరస్‌ సోకుతుందని చెప్పలేమని తాజా అధ్యయనంలో తేలింది. కోవిడ్‌–19 నిర్ధారణ అయిన వ్యక్తి ఉన్న కుటుంబంలోని దాదాపు 80 శాతం నుంచి 90 శాతం సభ్యులకు ఆ వైరస్‌ సోకకపోవచ్చని గుజరాత్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. అందుకు కారణం వారిలో ఆ వైరస్‌ నిరోధక శక్తి పెరగడమే కావచ్చని స్పష్టమైంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
  నేషనల్‌ క్లినికల్‌ రిజిస్ట్రీ ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌)
ఎందుకు :కరోనా బాధితుల చికిత్సను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, మరింత చికిత్స అందించేందుకు వీలవుతుందని
Published date : 04 Aug 2020 11:19AM

Photo Stories