Skip to main content

కరోనాను ఎదుర్కొనే సన్నద్ధత సూచీలో భార‌త్‌కు అగ్రస్థానం

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మన దేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.
Current Affairs

అమెరికా, బ్రిటన్‌ తదితర అగ్ర రాజ్యాల కంటే భారత్‌ ఎంతో మెరుగైన పనితీరు కనబరుస్తోందని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వపరంగా సన్నద్ధత సూచీలో మన దేశం ఆగ్రస్థానంలో నిలిచిందని ‘ఆక్స్‌ఫర్డ్‌ కోవిడ్‌–19 గవర్నమెంట్‌ రెస్పాన్స్‌ ట్రాకర్‌ (ఓఎక్స్‌సీ జీఆర్‌టీ) నివేదిక పేర్కొంది. ఆ నివేదికను ఏప్రిల్ 11న విడుదల చేశారు.


నివేదిక ప్రకారం...
  • క‌రోనా సన్నద్ధత సూచీలో మార్చి 9న 47.6 పాయింట్ల వద్ద ఉన్న భారత్‌ ఏప్రిల్‌ 10 నాటికి 100 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది.
  • స్పెయిన్, ఇటలీ 95.20 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. 80.90పాయింట్లతో జర్మనీ మూడో స్థానం, 71.40 పాయింట్లతో బ్రిటన్‌ నాలుగో స్థానం, 66.70పాయింట్లతో అమెరికా ఐదో స్థానంలో ఉన్నాయి.

6 దేశాలు.. 33 రోజులు
  • కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భారత్‌తోపాటు అమెరికా, బ్రిటన్, ఇటలీ, స్పెయిన్, జర్మనీ ప్రభుత్వాల సన్నద్ధత, తీసుకున్న చర్యలపై ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అధ్యయనం జరిపింది. ఇందులో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.
  • వైరస్‌ వ్యాప్తి ప్రబలంగా ఉన్న మార్చి 9 నుంచి ఏప్రిల్‌ 10 వరకూ ప్రభుత్వాల పనితీరును పరిగణనలోకి తీసుకున్నారు.
  • 12 అంశాల ప్రాతిపదికగా అధ్యయనం చేశారు. ఈ 12 అంశాల్లో లాక్‌డౌన్ అమ‌లు, ప్రజలకు అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమాలను చేపట్టడం, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా తక్షణ చర్యలు, ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేపట్టడం, వైద్య, ఆరోగ్య రంగాలకు అత్యవసర నిధుల కేటాయింపు, పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం, వైరస్‌ సోకినవారు ఎవరెవరిని కలిశారో గుర్తించడం వంటివి ఉన్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
కరోనాను ఎదుర్కొనే సన్నద్ధత సూచీలో భార‌త్‌కు అగ్రస్థానం
ఎప్పుడు : ఏప్రిల్ 11
ఎవరు : ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ
ఎక్కడ : ప్రపంచ‌వ్యాప్తంగా
Published date : 13 Apr 2020 05:50PM

Photo Stories