కరోనా వ్యాప్తిపై ఎమ్‌ఐటీ శాస్త్రవేత్తల అధ్యయనం
Sakshi Education
ప్రాణాంతక కరోనా వైరస్ విస్తరించిన తీరుపై బోస్టన్‌లోని మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అధ్యయనం నిర్వహించారు.
‘ఎస్‌ఎస్‌ఆర్‌ఎన్ రిపాసిటరీ’జర్నల్‌లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. వెచ్చటి వాతావరణం... గాలిలో తేమశాతం అధికంగా ఉండటం కరోనా వైరస్‌ను అడ్డుకునే ఆయుధాలని ఈ అధ్యయనం తేల్చింది.
వైరస్‌ను గుర్తించినప్పటి నుంచి మార్చి 22వ తేదీ వరకూ ఉన్న కరోనా కేసులన్నింటిలో 90 శాతం కేసులు ఉష్ణోగ్రతలు మూడు నుంచి 17 డిగ్రీ సెల్సియస్‌లు ఉన్న ప్రాంతాల్లోనే సంభవించాయని ఈ అధ్యయనం చెబుతోంది. ఈ ప్రాంతాల్లో గాల్లో తేమశాతం ప్రతి ఘనపు మీటర్ గాలిలో నాలుగు నుంచి తొమ్మిది గ్రాముల వరకూ ఉందని పేర్కొంది. సగటు ఉష్ణోగ్రతలు 18 డిగ్రీ సెల్సియస్, గాల్లో తేమశాతం ఘనపు మీటర్‌కు తొమ్మిది గ్రాములు ఉన్న ప్రాంతాల్లో కేవలం ఆరు శాతం కేసులే ఉన్నట్లు తెలిపింది. ఈ లెక్క ప్రకారం ఆసియా దేశాల్లో రుతుపవనాల్లాంటి వాతావరణం ఏర్పడితే వైరస్ వ్యాప్తి తగ్గే అవకాశముంది.

Published date : 27 Mar 2020 06:49PM