కరోనా వైరస్‌తో స్పెయిన్ యువరాణి కన్నుమూత
Sakshi Education
ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి స్పెయిన్ యువరాణి మారియా థెరీసా(86) కన్నుమూశారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో చికిత్స పొందుతూ మార్చి 26న తుది శ్వాస విడిచారు.
సోషియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేసిన మారియా స్పెయిన్ రాజు ఫెలిప్-6కు సోదరి. 1933 జులై 28 న ఆమె జన్మించారు. ఫ్రాన్స్‌లో చదువుకున్న మారియా సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించి ‘రెడ్ ప్రిన్సెస్’గా పేరు సంపాదించారు. మరోవైపు బ్రిటన్ రాజకుమారుడు చార్లెస్, ప్రధానమంత్రి బొరిస్ జాన్సన్, ఆరోగ్యశాఖ మంత్రికి కోవిడ్–19 సోకిన సంగతి తెలిసిందే.
Published date : 30 Mar 2020 06:39PM