కరోనా వైరస్‌పై అవగాహన కోసం గేమ్ రూపకల్పన చేసిన ట్రిపుల్ ఐటీ?
Sakshi Education
విద్యార్థుల్లో కోవిడ్–19పై పూర్తిస్థాయి అవగాహన కోసం ‘వరల్డ్ బీట్స్ ఎ వైరస్’ అనే సరికొత్త గేమ్ అందుబాటులోకి వచ్చింది.
హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ కవితా వేమూరి, పూర్వ విద్యార్థుల స్టార్టప్ గో లివ్ గేమింగ్ సొల్యూషన్స్, అగస్త్య ఫౌండేషన్‌లు కలిసి ఈ గేమ్‌ను రూపొందించారు. భారత ప్రభుత్వం ‘ధ్రువ్ తార’ పేరిట అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఇన్నోవేటివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ (పీఎంఐఎల్‌పీ) కింద ఈ గేమ్‌ను రూపొందించారు.
తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచడం, పాండెమిక్ పరిస్థితుల్లో తార్కికంగా ఆలోచించడం, క్రిటికల్ థింకింగ్ అలవాటు చేయడం లక్ష్యంగా వరల్డ్ బీట్స్ ఎ వైరస్ గేమ్‌ను తయారు చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వరల్డ్ బీట్స్ ఎ వైరస్ అనే సరికొత్త గేమ్ రూపకల్పన
ఎప్పుడు : ఏప్రిల్ 9
ఎవరు : హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ కవితా వేమూరి, పూర్వ విద్యార్థుల స్టార్టప్ గో లివ్ గేమింగ్ సొల్యూషన్స్, అగస్త్య ఫౌండేషన్‌లు కలిసి
ఎందుకు : విద్యార్థుల్లో కోవిడ్–19పై పూర్తిస్థాయి అవగాహన కోసం

Published date : 12 Apr 2021 06:25PM