Skip to main content

కరోనా వైరస్‌ జన్యుక్రమం నమోదు

ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్‌ను క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ), ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ జినోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ (ఐజీఐబీ)లు జన్యుక్రమ నమోదును చేప‌ట్టాయి.
Current Affairs
అన్నీ సవ్యంగా సాగితే ఒకట్రెండు వారాల్లోనే కనీసం 5 ఐసోలేట్‌ వైరస్‌ల జన్యుక్రమాల నమోదు పూర్తి చేస్తామని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా ఏప్రిల్ 8న తెలిపారు. జన్యుక్రమాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే ఈ వైరస్‌ ఎప్పుడు.. ఎలా పుట్టింది.. ఎలా పరిణమించిందన్న విషయాలు తెలుస్తాయని, తద్వారా భవిష్యత్తులో ఈ రకమైన వైరస్‌లను అడ్డుకోవడం సాధ్యమవుతుందని వివరించారు.

కరోనా బారిన పడ్డ వ్యక్తి నుంచి వేరు చేసిన వైరస్‌ను ఐసోలేట్‌ అంటారు. వైరస్‌ పూర్తి జన్యుక్రమాన్ని తెలుసుకోవాలంటే బోలెడన్ని ఐసొలేట్‌ల జన్యుక్రమాలు అవసరమవుతాయి. ఎంత ఎక్కువ సంఖ్యలో ఐసొలేట్‌ జన్యుక్రమాలు ఉంటే.. అంత కచ్చితత్వంతో జన్యుక్రమాన్ని నమోదు చేయొచ్చు. ఆ వైరస్‌ గురించి అధ్యయనం చేయొచ్చు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనా వైరస్‌ జన్యుక్రమం నమోదు
ఎప్పుడు : ఏప్రిల్ 8
ఎవరు : సీసీఎంబీ, ఐజీఐబీ
ఎందుకు : ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్‌ను క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు
Published date : 09 Apr 2020 06:55PM

Photo Stories