కరోనా టీకా తయారీకి వాషింగ్టన్ వర్సిటీతో ఒప్పందం చేసుకున్న భారత ఫార్మా?
Sakshi Education
ముక్కు ద్వారా అందించే కరోనా టీకా తయారీకి సంబంధించి అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీతో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ విషయాన్ని సెప్టెంబర్ 23న భారత్ బయోటెక్ వెల్లడించింది. టీకా లెసైన్సింగ్‌కు సంబంధించిన ఈ ఒప్పందం ప్రకారం... భారత్ బయోటెక్ అమెరికా, జపాన్, యూరప్ దేశాలు మినహా మిగిలిన దేశాల్లో టీకాను పంపిణీ చేసే హక్కులు కలిగి ఉంటుంది. హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో ఉన్న కంపెనీ కేంద్రంలో ఈ టీకా ఉత్పత్తి జరగనుంది. కనీసం వంద కోట్ల డోసులు తయారు చేయాలన్నది తమ లక్ష్యమని కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీతో ఒప్పందం
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : భారత్ బయోటెక్
ఎందుకు : ముక్కు ద్వారా అందించే కరోనా టీకా తయారీకి సంబంధించి
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీతో ఒప్పందం
ఎప్పుడు : సెప్టెంబర్ 23
ఎవరు : భారత్ బయోటెక్
ఎందుకు : ముక్కు ద్వారా అందించే కరోనా టీకా తయారీకి సంబంధించి
Published date : 24 Sep 2020 05:01PM